ముంబైలో దారుణం..

by సూర్య | Sat, Jan 09, 2021, 12:18 PM

ముంబైలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు కామాంధులు 19 ఏళ్ల మగ మోడల్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారం చేసి..అతడిని తీవ్రంగా కొట్టారు. ఈ దారుణ ఘటన ముంబైలోని థానేలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ కి చెందిన 19 ఏళ్ల యువకుడు మోడల్ గా పనిచేస్తున్నాడు. మోడలింగ్ లో అవకాశాలు కోసం ముంబై వచ్చాడు. థానే లో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు . అయితే ఈ నెల 3న అతడిని ఇద్దరు వ్యక్తులు బంధించి పాడుబడిన రెండంతస్తుల బిల్డింగ్ మీదకి దూసుకెళ్లారు.
అప్పటికే అక్కడకి మరో ఇద్దరు వచ్చారు. ఆ నలుగురు కలిసి ఆ యువ మోడల్ పై లైంగిక దాడికి పాల్పడ్డారు. అతడు ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయారు. తీవ్రంగా కొట్టారు. అంతేకాదు అత్యాచార దృశ్యాలను సెల్ పోన్ లో చిత్రీకరించారు. అనంతరం అతడి దగ్గర ఉన్న సెల్ ఫోన్, పర్సును దొంగిలించారు. తర్వాత కోలుకున్న యువ మోడల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ దారుణానికి ప్లాన్ వేసిన ప్రధాన నిందితుడు మోడల్ స్నేహితుడు పునీత్ శుక్లా గా గుర్తించారు.
అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి సంబంధించిన రికార్డ్ చేసిన వీడియోను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ శుక్లాతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

 
నాపై ప్రజలకి ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది Sat, May 04, 2024, 03:46 PM
జగన్‌ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు Sat, May 04, 2024, 03:45 PM
ముస్లింలు కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే Sat, May 04, 2024, 03:44 PM
పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే Sat, May 04, 2024, 03:43 PM
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎల్లటూరి శ్రీనివాసరాజు Sat, May 04, 2024, 03:37 PM