భూమా అఖిలప్రియ ఆస్తుల జాబితా ఇదేనా..!

by సూర్య | Sat, Jan 09, 2021, 12:05 PM

బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో మాజీమంత్రి భూమా అఖిలప్రియ పేరు మార్మోగిపోతుంది. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై చర్చించుకోవడం మెుదలుపెట్టారు ప్రజలు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు భూమా అఖిలప్రియ. హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని 25 ఎకరాల భూ వివాదమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. హైటెక్ సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే హఫీజ్‌పేట్‌లో ప్రస్తుతం ఎకరా కనీసం రూ.20 కోట్లు అయినా పలుకుతుంది.
ఈ క్రమంలో అసలు భూమా అఖిలప్రియకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఎన్ని కోట్ల ఆస్తులను ఇచ్చారనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి అఖిలప్రియ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అఫిడవిట్ పొందుపరిచారు. ఎన్నికల కమిషన్‌ వెబ్ సైట్‌లో ఈ అఫిడవిట్ అందుబాటులో ఉంది.
భూమా అఖిలప్రియ అందించిన అఫిడవిట్ ప్రకారం ఆమెకు అప్పుడు రూ.7,23,71,136. ఆమె భర్త భార్గవ్ పేరు మీద రూ.19,77,304 చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొంది. అలాగే ఆమెకు 400 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమెకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయి. అందులో తనకు వారసత్వంగా కొన్ని ఆస్తులు వచ్చాయని కూడా ఆమె పేర్కొన్నారు. స్థిరాస్తులు (వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, ధియేటర్లు) మొత్తం విలువ రూ.3,54,53,000గా పేర్కొన్నారు.
భూమా అఖిలప్రియ తన అఫిడవిట్‌లో పేర్కొన్న స్థిరాస్తుల వివరాలు ఇవే..!
వ్యవసాయ ఆస్తులు:
ఆళ్లగడ్డ సర్వే నెంబర్ 75/1, 75/3 (తల్లి శోభా నాగిరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన 1.21 ఎకరాల భూమిలో మూడోవంతు)
బండి ఆత్మకూర్ మండలం జీసీ పాలెంలో సర్వే నెంబర్లు 104/3, 105/4, 184/3, 504/B3, 504/B4, 520, 777/3, 780/15 (తండ్రి భూమా నాగిరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన 17.27 ఎకరాల భూమిలో మూడో వంతు)
వ్యవసాయేతర ఆస్తులు:
ఆళ్లగడ్డలో సర్వే నెంబర్ 73 లో 2,66,151 చదరపు అడుగుల భూమి. తండ్రి భూమా నాగిరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన సంక్రమించిన ఆస్తిలో మూడోవంతు
ఆళ్లగడ్డలో సర్వే నెంబర్ 370/A1,A2, A3, B1, B2 6,22,908 చదరపు అడుగుల భూమి. తండ్రి భూమా నాగిరెడ్డి నుంచి సంక్రమించిన ఆస్తిలో మూడోవంతు
ఆళ్లగడ్డలో సర్వే నెంబర్ 171/A, 171/B, 170/A, 128/A1, 128/B2లో 72,745 చదరపు అడుగుల భూమి తల్లి భూమా శోభా నాగిరెడ్డి ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో మూడో వంతు
కర్నూలు జిల్లా బనగానపల్లి సర్వే నెంబర్లు 207/1లో 7405 చదరపు అడుగుల భూమి. తల్లి భూమా శోభా నాగిరెడ్డి ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో మూడో వంతు
కమర్షియల్ బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్లు:
ఆళ్లగడ్డలోని బీబీఆర్ కాంప్లెక్స్ (19,872 చదరపు అడుగులు) . సర్వే నెంబర్ 128/3. తల్లి భూమా శోభా నాగిరెడ్డి ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో మూడోవంతు.
భూమా సినీ కాంప్లెక్స్ (8445 చదరపు అడుగులు) తిరుపతిలో అడ్రస్ 14-10-175. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో మూడోవంతు.
భవానీ ధియేటర్ (16,571 చదరపు అడుగులు), ఆళ్లగడ్డ. అడ్రస్ 9-15-33. తల్లి శోభా నాగిరెడ్డి ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో మూడోవంతు.
ఆళ్లగడ్డలో సర్వే నెంబర్ 269/Aలో ఉన్న ఇంటి నెంబర్ 8-1-65. తండ్రి భూమా నాగిరెడ్డి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో మూడోవంతు.
ఆళ్లగడ్డలో సర్వే నెంబర్ 133లో ఇంటి నెంబర్ 1-5-98. తల్లి శోభా నాగిరెడ్డి నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో మూడో వంతు.
అయితే హఫీజ్ పేటలోని ఆ భూమి తమదేనని భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డి స్పష్టం చేశారు. తనకు 12 ఏళ్ల వయసున్నప్పటి నుంచి అక్కడికి పిక్‌నిక్‌కు తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. అక్కడున్న సెక్యూరిటీని అడిగినా కూడా ఆ భూమి భూమా నాగిరెడ్డి కుటుంబానిదేనని చెప్తారని మౌనికారెడ్డి తెలిపారు. హాఫీజ్ పేటలోని ఆ భూమి తమ కంపెనీ పేరు మీద ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మెుత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM