ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పొరపాట్లు చేయకండి

by సూర్య | Fri, Jan 08, 2021, 05:01 PM

మీరు ఎంత మంచి ఆహరం తినాలని అనుకున్నా.. అప్పుడప్పుడు మీకు తెలియకుండానే మీరు అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటూ ఉంటారు. మీరు చేసే చిన్న పొరపాట్లు క్యాన్సర్ వంటి పెద్ద రోగాలకు కారణమవుతాయి. మనం భోజనం వండేటప్పుడు, తినేప్పుడు చేసే ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు. ఎంత మంచి పోషకాహారాన్ని తీసుకుంటున్నా.. తరచూ అనారోగ్యం పాలవుతోందంటే.. ఈ కింది పొరపాట్లు మీరేమైనా చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి.
భోజనం తినకపోవటం
మీరు మీల్స్ తినకపోవడం వలన అలసట, బద్ధకం, లో బీపీ, తలనొప్పి, ఏమాత్రం శక్తి లేకపోవటం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే మీల్స్ మిస్ అయితే శరీరానికి పోషకాల కొరత వస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందించే ఆహారం తినకపోవటం అనేది చాలా పెద్ద పొరపాటు. కాబట్టి ఎప్పుడూ మీరు మీల్స్ ను మిస్ చేయకండి. బరువు తగ్గాలనుకుంటే భోజనం తినకుండా ఉందామనుకోవద్దు. మితంగా రోజుకు మూడు సార్లు తినాలి. ఇలా చేస్తేనే మీరు బరువు కూడా తగ్గుతారు. ఎక్సర్ సైజు చేయకుండా భోజనం మిస్ చేస్తే సన్నబడరు. అంతేకాదు భోజనం మిస్ చేస్తే మీలో ఉన్న సహజసిద్ధమైన ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది.
పళ్లు, కూరగాయలు కడగకుండా పొట్టు తీయటం
అన్ని రకాల పళ్లు, కూరగాయల పొట్టుపై సూక్ష్మక్రిములు ఉంటాయి. అంతేకాదు చీడపీడల నివారణ కోసం పంటపొలాల్లో చల్లే రసాయనాలు కూడా వాటిపై పేర్కొని ఉంటాయి. కాబట్టి పళ్లు, కూరగాయలను కడగకుండా తినొద్దు. ఇలా చేయటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అవి మన ఇమ్యూనిటీపై దాడి చేస్తాయి, సంతానోత్పత్తిపై ఈ రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే పళ్లు, కూరగాయలు పొట్టు తీసేముందు, ముక్కలుగా కోసుకునే ముందే బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.
వాసన, రుచి చూడటం
ఆహార పదార్థాలు ఫ్రెష్ గా ఉందో లేదో అని వాసన చూడటం, కాస్త రుచి చేసి చూడటం ఇలాంటివి అస్సలు చేయొద్దు. అలా చేస్తే కంటికి కనిపించని సూక్ష్మక్రిములు మీపై దాడిచేస్తాయి. తాజాగా ఉందా? లేదా? అని మీరు చేసే చిన్న పొరపాటు అనారోగ్యానికి దారితీస్తుంది. ఏ పదార్థాలు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయో తెలిపే చార్ట్ ను ఫాలో అవడం మంచిది.
పడుకునే ముందు పళ్లు
పడుకునే ముందు పళ్లు తింటే అజీర్తి, పంటి సమస్యలు వస్తాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టకపోవచ్చు. యాసిడ్ ఎక్కువగా ఉన్న బత్తాయి, మామిడి, డ్రాగన్ ఫ్రూట, టమోటా వంటివి పడుకునే ముందు తినొద్దు. అవి తింటే మీ పంటిపై ఉన్న ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్రక్టోజ్, హై షుగర్ ఉన్న పళ్లను రాత్రి తినటం మానుకుంటే మంచిది. పియర్స్, యాపిల్, చెర్రీలు కూడా రాత్రి తినొద్దు. అవి తిని పడుకుంటే జీర్ణం కాకపోగా మీకు అనారోగ్యం రావచ్చు. పదేపదే మెలకువ రావటం, రాత్రంతా నిద్రపట్టకపోవటం వంటి చికాకులకు కారణం అవుతాయి.
బ్రేక్ ఫాస్ట్ మిస్టేక్స్
ఉదయం తినే అల్పాహారంలో తమ సొంత ప్రాంతం, సంప్రదాయ అలవాట్లకు బదులు పూర్తిగా మార్చేసిన మెనూ తినటం చాలా ప్రమాదకరం. మీ ప్రాంతంలో, మీ ఇంట్లో మొదటినుంచి ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ తింటున్నారో వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. ఉదాహరణకు మీరు ఇంట్లో ఇడ్లీ చేసుకునేవారైతే దానికి బదులు కార్న్ ఫ్లేక్స్ , బ్రెడ్ అండ్ బటర్ లాంటివి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవద్దు.
చక్కెర
టీ, కాఫీలు, స్వీట్లు, కేకులు, డెజర్ట్స్, జ్యూస్ వంటి వాటిలో షుగర్ నిల్వలు ఉంటాయి. అవి అత్యంత ప్రమాదకరం. మితిమీరిన చక్కెర నిల్వలతో డయాబెట్స్, ఊబకాయం, డిప్రెషన్ వంటివి వస్తాయి. త్వరగా వయసు మీదపడటం వంటివి చేసే చక్కెర బదులు తేనె, బెల్లం, తాటిబెల్లం వంటి ప్రత్యామ్నాయాలను వాడండి. వీటిని కూడా మితంగానే వాడాలి.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM