మాట తప్పిన భర్త.. కేసు పెట్టిన భార్య..

by సూర్య | Fri, Jan 08, 2021, 01:10 PM

తనను అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయ్యాక తాను జాబ్ చేస్తానని చెబితే.. తన భర్త ఒప్పుకున్నాడని, ఇప్పుడు వద్దంటున్నాడని, అలాగే జీన్స్ వేసుకోకూడదని నిషేధం విధించాడని తెలిపింది. ఈ ఘటన అహ్మదాబాద్‌ లోని సర్ఖేజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జుపుహారాకు చెందిన ఓ 37 ఏళ్ల మహిళకు 2017లో ఐటీ కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తితో వివాహం అయింది. ఆ మహిళకు ఇది రెండో వివాహం. ఆమె భర్తకు మూడో వివాహం. వివాహం అయ్యాక వేరు కాపురం పెడతానని, ఆమె జాబ్ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అతడు పెళ్ళికి ముందు ఆమెకు మాట ఇచ్చాడు. పెళ్లి తర్వాత కొద్ది రోజులకే అతడు మాట తప్పాడు. ఆమెను ఏ ఫంక్షన్ కి వెళ్లకుండా అడ్డుకున్నాడు. జీన్స్ ధరించకుండా నిషేధం విధించాడు. ఆమె తండ్రి కొనిచ్చిన ఫ్లాట్ లో ఉండేందుకు నిరాకరించాడు. దీంతో ఆ మహిళ ఆశలన్నీ ఆవిరయ్యాయి.
పిల్లలు పుట్టకపోవడానికి ఆ మహిళనే కారణమని భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు కూడా ఆమెను వేధించడంతో.. తీవ్ర నిరాశ చెందిన ఆమె సర్ఖేజ్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. గృహహింస కింద కేసు నమోదు చేయాలని కోరింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Latest News

 
ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా.. చంద్రబాబు స్టాండ్ ఏంటి Sun, Apr 28, 2024, 07:37 PM
వైఎస్ జగన్ పేరెత్తకుండానే.. బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు Sun, Apr 28, 2024, 07:32 PM
స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన క్వార్టర్ బాటిల్.. చివరకు ఎంతకు దిగజారారంటే Sun, Apr 28, 2024, 07:29 PM
పింఛన్ కోసం సచివాలయానికి పరుగులు అక్కర్లేదు.. మే నెల పింఛన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన Sun, Apr 28, 2024, 07:26 PM
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM