వారికి షాకిచ్చిన ఏపీ హైకోర్ట్..

by సూర్య | Fri, Jan 08, 2021, 01:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి కోడిపందేలకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారికి హైకోర్టు షాకిచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు జరగకుండా చూడాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు పాటించలేదని, ప్రస్తుత పిటిషన్ ను గతంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుతో కలిపి విచారణ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
కోడి పందేలు, బెట్టింగ్‌ లను నిలువరించేందుకు తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని షేక్‌ సలీం హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం.. కోడిపందేలు జరగకుండా చూడాలని, కలెక్టర్లను, ఎస్పీలకు 2016లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేసింది.

Latest News

 
మే 13న ఓట్ల సునామీ, కూటమిదే విజయం Fri, Mar 29, 2024, 10:38 AM
ప్రపంచానికి గొప్ప సందేశంగా జీసస్ తన జీవితాన్ని అందించారు Fri, Mar 29, 2024, 10:38 AM
కడప జిల్లాలో మండుతున్న ఎండలు Fri, Mar 29, 2024, 10:35 AM
కర్ణాటక మద్యం పట్టివేత Fri, Mar 29, 2024, 10:31 AM
3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన Fri, Mar 29, 2024, 10:00 AM