ధరలు పెంచిన మహీంద్రా

by సూర్య | Fri, Jan 08, 2021, 12:47 PM

దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్‌, వేరియంట్‌ని బట్టి గరిష్ఠంగా 1.9శాతం మేర ధరలు పెరిగినట్లు వెల్లడించింది. వాహనాన్ని బట్టి రూ.4,500 నుంచి 40,000 వరకు పెరుగుదల ఉన్నట్లు పేర్కొంది. 2020 డిసెంబరు 1 నుంచి 2021, జనవరి 7 మధ్య బుక్‌ చేసుకున్న కొత్త థార్‌ కార్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. నేటి నుంచి జరిగే థార్‌ బుకింగ్‌లకు.. డెలివరీ నాటి ధరలు వర్తిస్తాయని తెలిపింది.


నిర్వహణ ఖర్చులు, ముడిసరకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం సీఈవో విజయ్ నక్రా తెలిపారు. ధరలు తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని.. అందులో భాగంగా చాలా కాలం నుంచి పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చామని తెలిపారు. కానీ, రోజురోజుకీ నిర్వహణ ఖర్చులు భారంగా మారుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

Latest News

 
పిఠాపురం: నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..? వైసీపీ గూటికి వర్మ Sun, Apr 28, 2024, 08:03 PM
వైఎస్ జగన్ కాన్వాయి కిందపడిన కుక్క.. పోలీసులకు సీఎం సెక్యూరిటీ కీలక ఆదేశాలు Sun, Apr 28, 2024, 07:59 PM
విశాఖ పోర్టులో "ది వరల్డ్".. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్షియల్ నౌక విశేషాలు తెలుసా Sun, Apr 28, 2024, 07:56 PM
బాలయ్య ‘మందు అలవాటు’ గురించి చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Apr 28, 2024, 07:43 PM
ఏపీలో టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా.. చంద్రబాబు స్టాండ్ ఏంటి Sun, Apr 28, 2024, 07:37 PM