మరిన్ని రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ భయం

by సూర్య | Fri, Jan 08, 2021, 12:04 PM

దేశంలో బర్డ్‌ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. పెద్ద ఎత్తున పక్షులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కేసులు భారీగా నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
ఈ క్రమంలో హర్యానలోని పంచ్‌ కుల ప్రాంతంలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ను ప్రకటించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ లో ప్రభుత్వాలు బర్డ్‌ ఫ్లూను కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. జమ్ముకశ్మీర్‌ పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను ఈ నెల 14 వరకు నిషేధించింది.
బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచించింది. వైరస్ ‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపింది. బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం తక్కువ ఉందని చెబుతున్నారు. కానీ మరోవైపు ఈ వైరస్‌ సోకితే.. 10 మందిలో ఆరుగురు మృతిచెందే అవకాశముందని నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM