తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం!

by సూర్య | Fri, Jan 08, 2021, 11:51 AM

కరోనా నుంచి కోలుకోకముందే బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. తాజాగా ఏపీ,తెలంగాణలో కూడా ఈ వైరస్ కలవరం మొదలైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కొత్తపల్లె,పాములపాడు మండలాల్లో పలు కోళ్లు,కాకులు చనిపోతున్నాయి. అవి ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియడం లేదు. పలు గ్రామాల్లో కోళ్లు, కాకులు చనిపోతున్నాయి. కోళ్లు చనిపోయిన తర్వాత ముక్కులోంచి ఓ ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బొబ్బలు, చర్మం రాలిపోవడాన్ని గుర్తించారు. కోళ్లకు చర్మంపై బొబ్బలు, చర్మం రాలిపోవడాన్ని గుర్తించారు.
గురువారం కొత్తపల్లె మండలం సింగరాజుపల్లెలో సంజీవరాయుడుకు చెందిన 50 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అదే ఊరిలో మరో ఐదు కాకులు కూడా మృతి చెందాయి. పాములపాడు,కృష్ణానగర్ లో 70 కోళ్లు చనిపోయాయి. ఈ విషయం తమ దృష్టికి రాలేదని పాములపాడు పశువైద్యాధికారి అన్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా కొల్లిపర సమీపంలో కొన్ని గ్రామాల్లో కూడా కాకులు, కోళ్లు ఇలాగే మృత్యువాత పడ్డాయి. దీంతో తెలంగాణ,ఏపీలో ఆందోళన నెలకొంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM