అమెరికాలో హింసాత్మకం.. ట్రంప్‌ తీరుపై ఆగ్రహం..

by సూర్య | Thu, Jan 07, 2021, 12:52 PM

అమెరికా క్యాపిటల్‌ భవనంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాషింగ్టన్‌ డీసీ పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ బుధవారం (అక్కడి కాలమానం ప్రకారం) సమావేశమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ‘క్యాపిటల్‌ భవనం’లోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM