మంత్రి వెలంపల్లి వ్యాఖ్యలపై క్షత్రియ మహిళల నిరసన

by సూర్య | Thu, Jan 07, 2021, 12:54 PM

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని క్షత్రియ యువజన సంఘం తీవ్రంగా నిరసించింది .మంత్రి వేల్లంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ బుడమేరు వంతెన వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు .అశోక గజపతిరాజు చిత్రపటానికి కూడా క్షీరాభిషేకం నిర్వహించి తమ నిరసన తెలిపారు.ఈ కార్యక్రమానికి క్షత్రియ యువజన సంఘం ప్రతినిధులు దుర్గా ప్రసాద్ రాజు, గొట్టుముక్కల రఘురామరాజు నేతృత్వం వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన స్థాయిని మరచి అశోక గజపతి రాజు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబం చరిత్ర మంత్రి వెల్లంపల్లి తెలుసుకోవాలని వారు సూచించారు. వేలాది ఎకరాలను పేద ప్రజల కోసం దానం చేసిన అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి లేదని వారు స్పష్టం చేశారు. మూడు రోజుల్లో వెల్లంపల్లి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దేవాదాయశాఖను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న వెల్లంపల్లి శ్రీనివాస్, అశోక్ గజపతిరాజు కుటుంబం గొప్పతనాన్ని గుర్తించాలని వారు హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు క్షత్రియ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

 
శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, అర్చనలు నిలుపుదల Thu, Mar 28, 2024, 03:09 PM
భూమా అఖిలప్రియ అరెస్ట్ ! Thu, Mar 28, 2024, 02:15 PM
శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 Thu, Mar 28, 2024, 02:13 PM
ఎర్రగుంట్లలో ఉద్రిక్తత, అఖిలప్రియ అరెస్ట్ Thu, Mar 28, 2024, 01:53 PM
నాకు అండగా ఉండండి Thu, Mar 28, 2024, 01:52 PM