కస్టమర్లను వేధిస్తోన్న బజాజ్ ఫైనాన్స్ కు భారీ షాకిచ్చిన ఆర్బీఐ

by సూర్య | Wed, Jan 06, 2021, 02:57 PM

ప్రముఖ ఫైనాన్స్ సంస్థ బజాజ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది. కస్టమర్ల నుంచి రుణాలు రికవరీ చేయడంలో బజాబ్ ఫైనాన్స్ అనుసరిస్తున్న పద్దతులే ఇందుకు కారణం. కస్టమర్ల నుంచి రుణ రికవరీలో బజాజ్ ఫైనాన్స్ పద్ధతి బాగోలేదని చాలా ఫిర్యాదులు రావడంతో ఆర్బీఐ కొరడా ఝళిపించింది. రూల్స్ అతిక్రమించినందుకు భారీ జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బజాజ్ ఫైనాన్స్ కంపెనీపై రూ 2.5 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ తన ఔట్ సోర్సింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మేనేజింగ్ రిస్క్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ను అతిక్రమించడంతో ఆర్బీఐ సీరియస్ అయింది. ఆర్బీఐ నిర్దేశించిన రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం కస్టమర్ల నుంచి బజాజ్ ఫైనాన్స్ రుణాలు రికవరీ చేయడం లేదు.ఇంకా బజాజ్ ఫైనాన్స్ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ నిబంధనలు కూడా అతిక్రమించిందని ఆర్‌బీఐ తెలిపింది.


బజాజ్ ఫైనాన్స్ నిబంధనలను అతిక్రమించడంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ 1934లోని సెక్షన్ 58 జీ, 58 బీలో ఉన్న పలు సబ్‌సెక్షన్ల కింద బజాజ్ ఫైనాన్స్‌పై జరిమానా విధించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రుణ రికవరీలో భాగంగా రికవరీ ఏజెంట్లు వినియోగదారులను వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆర్బీఐకి ఫిర్యాదులు అందాయ్. వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో బజాజ్ ఫైనాన్స్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొని జరిమానా విధించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. రుణ రికవరీపై కంపెనీపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని ఈ సందర్భంలో తెలిపింది. ఇలాంటి చర్యలు మరోసారి పునారవృతం అయితే...కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


 


 

Latest News

 
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM
మూడు నెలల్లో రెండు పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే! Mon, Apr 29, 2024, 08:06 PM
టీడీపీకి భారీ ఊరట.. ఆ నియోజకవర్గాల్లో నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న రెబల్ అభ్యర్థులు Mon, Apr 29, 2024, 08:02 PM