ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం..

by సూర్య | Fri, Oct 16, 2020, 05:16 PM

దేశంలో రోజురోజుకు ఆడవారిపై దాడులు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి వారిని అంతమెుందిస్తున్నారు. మరికొందరు ఆడవారి బలహీనతలను అడ్డుపెట్టుకుని వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగి సర్వీసులో ఉండగానే మృతి చెందాడు. దీంతో తమకు కారుణ్య నియామకంలో అవకాశం కల్పించాలని బాధితుడి కుటుంబ సభ్యులు రైల్వేశాఖలో కార్మిక సంక్షేమశాఖ అధికారిని మెురపెట్టుకున్నారు.
ఇదే అదనుగా ఉద్యోగమిస్తామని నమ్మించి తన కోరికలు తీర్చుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు ఆ యువతి పెళ్లి చెడగొట్టేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళ్తే గుంతకల్లు రైల్వే డివిజనల్ కార్యాలయం కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సర్వీసు ఉండగానే మృతి చెందాడు. సాధారణంగా మృతి చెందిన ఉద్యోగి స్థానంలో వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద అర్హతలు పరిశీలించి నిబంధలన ప్రకారం ఉద్యోగం కల్పిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో వెల్ఫేర్ ఇన్ స్పెక్టర్ కీలక పాత్ర పోషిస్తాడు.
అలాంటి స్థానంలో ఉన్న రైల్వే కార్మిక సంక్షేమశాఖ అధికారి బరితెగించాడు. తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న బాధితుడి కుటుంబంపై జాలి చూపాల్సింది పోయి దారుణంగా ప్రవర్తించాడు. ఉద్యోగం కోసం వచ్చిన యువతిని లోబరుచుకుని అక్రమ సంబంధం నెరిపాడు. అంతటితో ఆగకుండా వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేశాడు. గత ఏడాది వీరిద్దరి అభ్యంతరకర ఫోటో బయటకు రావడంతో ఉన్నతాధికారులు అతనిని బదిలీ చేశారు. తర్వాత ఆ మహిళా ఉద్యోగినికి పెళ్లి కుదిరింది.
కొంతకాలం తర్వాత తిరిగి గుంతకల్లు బదిలీ చేయించుకున్న ఆ అధికారి.. మరోసారి ఆ మహిళను వేధించడమే కాకుండా ఆ యువతితో ఉన్న వీడియోలు పెళ్లి వారికి పంపించాడు. తనతో ఉండాలని..పెళ్లి చేసుకుంటే ఊరుకోనని బెదిరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై 420, 358, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తన జీవితాన్ని నాశనం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM