విదేశాల నుంచి ఏసీల దిగుమతిని నిషేదించిన కేంద్రం...

by సూర్య | Fri, Oct 16, 2020, 03:08 PM

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన మేరకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.


భారత్ దాదాపు 30 శాతం ఏసీలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని, సాధ్యమైనంత తక్కువ సమయంలో ఈ దిగుమతిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని ఆ ప్రకటనలో కోరారు. అత్యవసరమైనవి తప్ప ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం మోదీ సర్కారు ముఖ్య లక్ష్యం. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM