160 జీహెచ్ఎంసీ షెల్టర్ కేంద్రాల్లో లక్ష మందికి ఆశ్రయంతో పాటు ఆహారం అందిస్తున్నాం : బొంతు రామ్మోహన్

by సూర్య | Fri, Oct 16, 2020, 03:06 PM

నగరంలో కొన్ని వెంచర్లు నిబంధనలు పాటించకపోవడంతో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 160 జీహెచ్ఎంసీ షెల్టర్ కేంద్రాల్లో లక్ష మందికి ఆశ్రయంతో పాటు.... ఆహారం అందిస్తున్నామని బొంతు రామ్మోహన్ తెలిపారు. కొన్ని కాలనీల్లో ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుని.. ఇబ్బందులు లేకుండా చూసుకున్నారన్నారు.


రానున్న రోజుల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామన్నారు. నగరంలో 5 వేల కోట్ల రూపాయలతో నాలాలను అధునికరిస్తున్నామని బొంతు రామ్మోహన్ తెలిపారు. నగరంలో రెండు, మూడు రోజుల్లో సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు. శిథిల భవనల కూల్చివేతల ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఈ ఏడాది నగరంలో 300 శిథిల భవనాలను కూల్చివేశామన్నారు. ఎలాంటి సహాయం అందించేందుకైనా జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందని బొంతు రామ్మోహన్ తెలిపారు. 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM