జగన్ క్షమాపణలు చెబితే.. ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయి :రఘురామకృష్ణ

by సూర్య | Fri, Oct 16, 2020, 03:00 PM

కోర్టు ధిక్కారణకు పాల్పడిన వారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ధిక్కారణకు పాల్పడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పదవి కోల్పోవాల్సి వస్తుందన్నారు. తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెబితే.. ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.


న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేయడం సరికాదని రఘురామ అన్నారు. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరగలేదన్నారు.  న్యాయవ్యవస్థపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా..న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని, న్యాయవ్యవస్థపై దాడి కోర్టు ధిక్కారణగా పరిగణించాలని రఘురామ అన్నారు.


న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగాలని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోవాలని రఘురామ సూచించారు. విజయలక్ష్మి, భారతి కూడా సీఎం కావచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసును సెక్షన్‌ 174 కింద నమోదు చేసిన..పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్య తేజస్విని ఘటన వెనుక కూడా న్యాయవ్యవస్థ లోపం ఉన్నట్లు.. కొందరు మాట్లాడటం సిగ్గుచేటని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM