'దిశ' స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తాం : డీజీపీ సవాంగ్

by సూర్య | Fri, Oct 16, 2020, 03:12 PM

విజయవాడ క్రీస్తురాజపురానికి చెందని దివ్య తేజస్విని అనే యువతిపై నాగేంద్రబాబు అనే పెయింటింగ్ పని చేసే యువకుడు దాడి చేసి అంతమొందించిన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం బాధాకరమని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.


ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీపీ స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేసినట్టు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. 'దిశ' స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు.

Latest News

 
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM
చంద్రబాబు ని కలిసిన బత్యాల Tue, Apr 23, 2024, 12:33 PM