కరోనా మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

by సూర్య | Fri, Oct 16, 2020, 02:30 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులతో పాటే మరణాల సంఖ్య పెరిగే అవకాశ ముంటుం దని ప్రపంచ దేశా లను హెచ్చరించింది. ప్రస్తుతం ఐరోపాలో నిత్యం లక్ష మంది వైరస్‌ బారిన పడుతున్నారు. అందులో కేవలం బ్రిటన్‌లోనే 20 వేల కేసులు వస్తున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య 5వేలకు లోపుగా ఉంటోంది. ఏప్రిల్‌లో ఆ సంఖ్య అత్యధికంగా 7,500కు చేరింది. మరణాల సంఖ్య తగ్గుదల విషయంలో తాము నిశ్చింతగా లేమని డబ్ల్యుహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ చెప్పారు. మరణాల రేటు పడిపోయిందనే విషయంపై తాము ఆత్మసంతృప్తితో లేమని అన్నారు. ఇక టీకా అందుబాటులోకి వచ్చే విషయంపైనా ఆమె కీలక వ్యాఖ్య చేశారు. యువత, ఆరోగ్యవంతమైన వ్యక్తులు వ్యాక్సిన్‌ కోసం 2022 వరకు వేచి చూడాల్సి ఉందని తెలిపారు.


 


 

Latest News

 
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM
సినిమా స్క్రిప్టు ప్రసంగాలకు జనం నవ్వుకుంటున్నారు Sat, May 04, 2024, 10:45 AM
వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వొద్దని టీడీపీనేతలు చెప్పింది నిజం కాదా..? Sat, May 04, 2024, 10:44 AM
వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు కావాలనే తప్పించారు Sat, May 04, 2024, 10:42 AM
సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో చంద్రబాబు దిట్ట Sat, May 04, 2024, 10:41 AM