ఐపీఎల్ 2020: ముంబై- కోల్ కతా పోరులో గెలుపెవరిది?

by సూర్య | Fri, Oct 16, 2020, 01:43 PM

ఐపీఎల్ 13 లో భాగంగా నేడు అబుదాబిలో ముంబై, కోల్ కతా జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మొత్తం 26 మ్యాచులు జరగ్గా, ముంబై 20, కోల్ కతా 6 మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక తాజాగా అబుదాబిలో జరుగనున్న మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. మరి ఇరు జట్ల బలాబలాలు విశేషాలు తెలుసుకుందాం పదండి.
మొదటి స్థానం కోసం..
ఢిల్లీతో తో జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ముంబై జట్టు సభ్యులు మరో గెలుపు కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. పాయింట్ల పట్టికలో ముంబై జట్టును అగ్రస్థానములో నిలపాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. రోహిత్ తో కలిసి క్వింటన్ డికాక్‌భాగస్వామ్యం‌‌ పటిష్టంగా ఉంది. వీరి బ్యాటింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కీరన్ పొలార్డ్‌లతో మిడిలార్డర్‌ కూడా బలంగా ఉంది. అయితే, బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ముంబై.. బౌలింగ్‌లో మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెట్టే అంశం. బుమ్రాపైనే పేస్ భారం పడనుంది.
గెలుపు కోసం..
బెంగళూర్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. క్లిష్టమైన సమయాల్లో జట్టు తేరుకునేలా చేయడంలో కెప్టెన్ దినేష్ కార్తీక్ ది అందెవేసిన చెయ్యి. ఒక్కసారిగా మ్యాచ్‌ను తమవైపు తిప్పే బౌలర్లున్న కోల్‌కతా.. వేలంలో కూడా టాలెంటెడ్ ప్లేయర్లను కోల్ కతా వేలంలో దక్కించుకుంది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, అండ్రూ రస్సెల్‌‌, ఇయాన్‌‌ మోర్గాన్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, టామ్‌‌ బాంటన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి.. ఇలా ఎనిమిదో స్థానం వరకు ఆడే బ్యాటింగ్ డెప్త్‌‌ ఉంది. బౌలింగ్‌‌లో సునీల్ నరైన్‌‌, కుల్దీప్‌‌ స్పిన్ మ్యాజిక్‌‌ చేయగలరు. ప్యాట్ కమిన్స్‌‌, లూకీ ఫెర్గుసన్‌‌, శివమ్‌‌ మావి, ప్రసిద్‌‌ కృష్ణతో పేస్‌‌ విభాగం బలంగానే ఉంది.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ , సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా
కోల్‌కతా నైట్ రైడర్స్ :
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సునిల్‌ నరైన్‌, శుభ్‌మన్‌గిల్‌, నితీశ్‌ రాణా, మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, కమిన్స్‌, కుల్దీప్‌యాదవ్‌, కమలేశ్‌ నాగర్కోటి, శివం మావి, ప్రసిద్‌ క్రిష్ణ
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : ముంబై ఇండియన్స్
కెప్టెన్: రోహిత్ శర్మ
యజమాని: ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
విజేత : 2013, 2015, 2017, 2019
రన్నరప్ : 2010
టీమ్ వివరాలు సంక్షిప్తంగా
టీమ్ పేరు : కోల్‌కతా నైట్ రైడర్స్
కెప్టెన్: దినేష్ కార్తీక్
యజమాని: నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
విజేత : 2012, 2014
రన్నరప్ :-

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM