ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువైంది... రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలకు ఆదేశిస్తా : కిషన్ రెడ్డి

by సూర్య | Wed, Oct 14, 2020, 02:47 PM

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. యథేచ్చగా స్మగ్లింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని ఏపీ బీజేపీ నేతలు భానుప్రకాశ్, రమేశ్ నాయుడు కలిశారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ తరలింపుపై వినతిపత్రం ఇచ్చారు. తిరుమలలో ఎర్రచందనాన్ని కాపాడాలని కోరారు. కొందరు నేతలు స్మగ్లర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయాల చందనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చెప్పారు.


ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలకు ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM