పొలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి తెస్తున్నారు: డీజీపీ సవాంగ్

by సూర్య | Wed, Oct 14, 2020, 02:27 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలు రాయడంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏదైనా ఘటన జరిగితే అవాస్తవాలతో నాకు లెటర్స్ రాస్తున్నారు. విచారణ జరిపితే అవాస్తవంగా తెలుస్తుంది. పొలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి తెస్తున్నారు. ఇటీవల హిందూ దేవాలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రకాశం జిల్లాలో హోంగార్డ్స్ అభ్యున్నతికి సహకార సంఘాన్ని ప్రారంభించాం. ప్రకాశం పోలీసులు టెక్నాలజిలో ముందున్నారు. మిగిలిన జిల్లా పోలీసులకు ప్రకాశం పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నూతన సాంకేతిక మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నాం. సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంది. ఫిర్యాదు దారుడు పోలీస్ స్టేషన్‌కి రాకుండానే.. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అసాంఘిక శక్తులపై పోలీస్  నిఘా ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు’ అని డీజీపీ హెచ్చరించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM