తండ్రి కాబోతున్న జహీర్‌ఖాన్‌..!

by సూర్య | Mon, Oct 12, 2020, 01:03 PM

మాజీ ఇండియన్‌  క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే వారి ఇంట్లోకి మూడో మనిషి రాబోతున్నారు. జహీర్‌ ఖాన్‌ బాలీవుడ్‌ నటి సాగరిక గాట్గేను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ యూఏఈలో ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఐపీఎల్‌ జరుగుతుండగా జహీర్‌ఖాన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌(డీసీఏ)గా పనిచేస్తున్నారు. జహీర్‌ఖాన్‌ తన పుట్టినరోజు వేడు‍‍కలను కూడా ముంబై ఇండియన్స్‌ జట్టుతో కలసి దుబాయ్‌లోనే జరుపుకున్నారు.


ఈ సందర్భంగా జహీర్‌ గురించి వర్ణించాలని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం కోరగా జహీర్‌ అందరితో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలను తీసుకుంటాడని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. ఇక టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా తాను తండ్రికాబోతున్నట్లు, వచ్చే ఏడాది జనవరిలో వారి ఇంటికి ఒక అతిధి రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.    

Latest News

 
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM
విజయవాడ సెంట్రల్ బరిలో కవి జొన్నవిత్తుల.. ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా Fri, May 03, 2024, 07:43 PM
ఏపీలోని రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. వందల కోట్లల్లో ఆస్తులు.. టాప్ 5లో అంతా వాళ్లే Fri, May 03, 2024, 07:40 PM
షర్మిల, సునీత పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కడప కోర్టుకు కీలక ఆదేశాలు Fri, May 03, 2024, 07:37 PM
ముద్రగడకు ఇంటిపోరు.. పవన్‌కు మద్దతుగా కూతురు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Fri, May 03, 2024, 07:34 PM