ఎల్‌ఐసీ నుంచి అదిరే పాలసీ..

by సూర్య | Mon, Oct 12, 2020, 01:39 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చినా కూడా ఎల్‌ఐసీ పాలసీలనే ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక భద్రత, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల సాకారం కోసం ఎల్‌ఐసీ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.ఎల్‌ఐసీ చాలా రకాల పాలసీలు ఆఫర్ చేస్తోంది. వీటిల్లో ఎల్‌ఐసీ నివేశ్ ప్లస్ ప్లాన్ కూడా ఒకటి. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. అంటే ఒకేసారి డబ్బులు పెట్టి ఈ పాలసీ కొనుగోలు చేయాలి. ఈ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగానే కొనుగోలు చేయొచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో ఏజెంట్ల ద్వారా కూడా పాలసీ తీసుకోవచ్చు.


ఎల్‌ఐసీ నివేశ్ ప్లస్ పాలసీలో కనీసం రూ.1,00,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బుకు 1.25 రెట్లు బీమా మొత్తం, 10 రెట్లు బీమా మొత్తం అనేవి ఆప్షన్లు. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. 90 రోజుల నుంచి 70 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ పాలసీలో చేరొచ్చు. పాలసీ టర్మ్ 10 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పాలసీదారుడు పాలసీ గడువు ముందుగానే మరణిస్తే డెత్ బెనిఫిట్స్‌ను నామినీకి అందిస్తారు. అదే పాలసీ మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత కూడా పాలసీ దారుడు జీవించి ఉంటే అప్పుడు మెచ్యూరిటీ బెనిఫిట్స్ పొందొచ్చు.


ఉదాహరణకు 18 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఆన్‌లైన్‌లోనే ఎల్‌ఐసీ నివేశ్ ప్లస్ పాలసీ తీసుకొని సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజీ ఆప్షన్ ఎంచుకున్నాడు. పాలసీ టర్మ్ 25 ఏళ్లు. ఇప్పుడు ఈ పాలసీ దారుడికి మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.5,14,909 వస్తాయి.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM