నేటి బంగారం, వెండి ధరలు..

by సూర్య | Mon, Oct 12, 2020, 12:58 PM

బంగారం ధరలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం బాగా కనిపిస్తోంది. మరోవైపు భారత్ లో గత 4 రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు పండగ సీజన్ వస్తుండటమే కారణంగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రజల దగ్గర ఆదాయం పెరుగుతుండటంతో... డబ్బును సేవింగ్స్‌గా మార్చుకోవడానికి కొంత మంది బంగారాన్ని కొంటున్నారు. దీంతో ధర క్రమంగా పెరుగుతోంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.48,820 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.53,250 ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.62,910 ఉంది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.503.28 ఉంది. పరిశ్రమల నుంచి వెండికి డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల ధర కూడా పెరుగుతోంది. పండుగల సీజన్ వచ్చేస్తోంది కాబట్టి... బంగారానికి డిమాండ్ పెరగడం ఖాయం. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.

Latest News

 
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM
జనసేన పార్టీ మహిళా అభ్యర్థి ఆస్తులు ఏకంగా రూ.894 కోట్లు.. ఆ ఒక్క కంపెనీ విలువే Sat, Apr 20, 2024, 09:03 PM
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 08:59 PM
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM