నేడే నీట్ 2020 ఫలితాలు విడుదల

by సూర్య | Mon, Oct 12, 2020, 11:24 AM

దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష 2020 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నీట్ పరీక్షల ఫలితాలు  అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.


కాగా, నీట్ 2020 పరీక్షను కరోనా కారణంగా చాలా ఆలస్యంగా నిర్వహించారు. కోవిడ్19 నిబంధనలతో పటిష్ట చర్యలు, జాగ్రత్తల నడుమ సెప్టెంబర్ 13న పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 15.97 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ర్యాంకుల ఆధారంగా దేశ వ్యాప్తంగా 542 మెడికల్ కళాశాలల్లోని 80,005 సీట్లను భర్తీ చేస్తారు. 313 డెంటల్ కాలేజీలలోని 26,949 సీట్లతో పాటు ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా భర్తీ చేయనున్నారని తెలిసిందే.

Latest News

 
13, 656 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం Fri, May 10, 2024, 11:25 AM
వైసీపీ నుండి జనసేనలోకి చేరికలు Fri, May 10, 2024, 10:53 AM
ఇరుక్కుపోయిన లారీ అవస్థలు పడుతున్న గ్రామస్తులు Fri, May 10, 2024, 10:50 AM
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం Fri, May 10, 2024, 10:25 AM
ఏపీ రెయిన్ అలెర్ట్ Thu, May 09, 2024, 11:43 PM