ముంబై వ్యాప్తంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

by సూర్య | Mon, Oct 12, 2020, 11:29 AM

ఆర్థిక రాజధాని ముంబై ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయింది. టాటా పవర్ యూనిట్ దెబ్బతినడంతో... ఒక్కసారిగా మహా నగరంలో కరెంటు పోయింది. ఎటు చూసినా చీకట్లే. ఎక్కడికక్కడ ప్రజా రవాణా ఆగిపోయింది. రైళ్లు నడవట్లేదు. పనులన్నీ నిలిచిపోయాయి. ప్రజలు ఆగ్రహావేశాలతో విద్యుత్ అధికారులకు కాల్స్ చేసి... ఫైర్ అవుతున్నారు. సౌత్ ముంబై, సెంట్రల్ ముంబై, నార్త్ ముంబై... అంతటా ఈ చీకటి అలుముకుంది. మీకు డౌట్ రావచ్చు... పగటి పూట చీకటేంటి అని... ముంబైలో పగటి వేళ కూడా లైట్లు వెలగాల్సిందే. అంతలా అక్కడి అపార్ట్‌మెంట్లు ఇరుకుగా ఉంటాయి. వాటిలోకి బయటి నుంచి వెలుతురు అన్నదే రాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ కరెంటు పోవడం అన్నది పెను సమస్యే.


ముంబైకి టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ లోని విద్యుత్ జనరేషన్ యూనిట్ నుంచి పవర్ సప్లై అవుతుంది. దాన్లో టెక్నికల్ సమస్యలు రావడంతో... ఉదయం 9.45కి ఒక్కసారిగా కరెంటు పోయింది. ఇప్పటికీ అది రాలేదు. సగానికి పైగా నగరం ఇప్పుడు కరెంటు లేక అల్లాడిపోతోంది. టెక్నికల్ సమస్య రావడంతో... కంపెనీ... పవర్ సప్లై జరిగే చాలా ఫీడర్లను స్విచ్ఛ్ ఆఫ్ చేసింది. దాంతో... కరెంటు సరఫరా ఆగిపోయింది. "ట్రాంబే పవర్ స్టేషన్‌లోని యూనిట్ 5లో తలెత్తిన టెక్నికల్ సమస్య వల్ల... 9.45 నుంచి పవర్ సప్లై ఆగిపోయింది." అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించింది.


ముంబైలో ఏం జరగాలన్నా... కరెంటుతో పని తప్పదు. అందువల్ల ప్రభుత్వ సంస్థ బెస్ట్ ద్వారానే పవర్ సప్లై అయ్యేలా చేస్తున్నారు. బెస్ట్ అంటే... బ్రిహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్. ఈ సంస్థ... టాటా పవర్ నుంచి విద్యుత్ పొందుతోంది. దాదాపు 10 లక్షల మందికి ఈ కరెంటు సప్లై అవుతోంది. వాళ్లంతా ఇప్పుడు చీకట్లో ఉన్నారు. తాము ఇతర మార్గాల ద్వారా కరెంటు సప్లై జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని బెస్ట్ తన ప్రకటనలో తెలిపింది.


టాటా పవర్ కారణంగా... నగర పశ్చిమ శివారు ప్రాంతాల్లో పవర్ సప్లై చేసే రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌కి కూడా సమస్యలు తలెత్తాయి. టాటా పవర్ వల్ల తమ ట్రాన్స్‌మిషన్ కారిడార్‌కి కూడా కరెంటు సప్లై సమస్యలు తలెత్తినట్లు రిలయన్స్ తెలిపింది. "జరిగిన దానికి చింతిస్తున్నాం. పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దేందుకు టాటా పవర్ వారితో టచ్‌లో ఉంటున్నాం" అని రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ తన ప్రకటనలో తెలిపింది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM