స్టాఫ్ నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by సూర్య | Sat, Oct 10, 2020, 04:05 PM

ఏపీలో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్. కొవిడ్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి మంచి అవకాశం వచ్చింది. ప్రభుత్వమే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్‌తో పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో నివసిస్తున్న ఏపీ వారికి చాలా మందికి ఈ విషయం తెలియదు. అదే విధంగా చాలా ఏళ్ల క్రితం తెలంగాణకు వచ్చి స్థిరపడ్డ ఏపీ వారిలో కూడా కొంత మంది ఈ ఉద్యోగాలకు అర్హులయ్యే అవకాశం ఉంది. స్కూల్ విద్య ఏపీలో పూర్తి చేసి తెలంగాణలో నివసించే వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే.


కర్నూలు జిల్లాలో భారీ సంఖ్యలో మెడికల్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 201 స్టాఫ్ నర్స్‌ల పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరిగింది. అలాగే స్పెషలిస్ట్ ఎంవో పోస్టులు 15, మెడికల్ ఆఫీసర్ల పోస్టులు 23, ల్యాబ్ టెక్నిషియన్ల పోస్టులు ఏడు, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు 12, సైకాలజిస్ట్, ఫీల్డ్ వర్కర్, సోషల్ వర్కర్ పోస్టులు ఐదు, ఆడియోలజిస్ట్, ఓపిటోమెరిట్రిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, సోషల్ వర్కర్, డెంటల్ టెక్నిషియన్ పోస్టులు 25 ఉన్నాయి. వీటితో పాటు కౌన్సిలర్ పోస్టులు, మోనటరింగ్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఐటీడీఏ ప్రోగ్రామ్ ఆఫీసర్, అకౌంటెంట్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అడోలెన్సెంట్ కౌన్సిలర్ పోస్టులు, ఆర్కేఎస్కే కన్సల్టెంట్ పోస్టులు 24 ఉన్నాయి. వీటితో పాటు ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్ కన్సల్టెంట్, ఏపిడమోలజిస్ట్, డేటా ఎంట్రీ ఆఫరేటర్, సపోర్ట్ స్టాఫ్, వార్డ్ క్లీనర్స్ హాస్పటల్ అటెండెంట్, శానిటరీ అటెండెంట్, పోస్టులు 322 ఉన్నాయి. ఎంవో డెంటల్ పోస్టులు రెండు ఉన్నాయి.


స్టాఫ్ నర్స్‌ల పోస్టుల కోసం అప్లై చేసే అభ్యర్థులు GNM కోర్స్ లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ. 22,500లు ఇస్తారు. స్పెషలిస్ట్ ఎంవో పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఎంబీబీఎస్‌తో పాటు పీజీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లమా చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు లక్షకు పైగా వేతనం ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.53495లు జీతం అందజేస్తారు. ఎంవో డెంటల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు బీడీఎస్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.30000 శాలరీ అందజేస్తారు. ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్ చేసి, ఏడాది పాటు ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చేసి ఉండాలి. పదో తరగతి చేసినవాళ్లు రెండేళ్ల పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.19019లు అందజేస్తారు.


ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్ చేసి ఉండాలి. లేదా ఏడాదిన్నర పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్‌గా పని చేసి ఉండాలి. ఏదన్న ఆస్పత్రిలో ఏడాది పాటు పని చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.30000లు అందజేస్తారు. అదేవిధంగా ఫీల్డ్ వర్కర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్ పోస్టులకు అప్లై చేసేవాళ్లు ఆయా విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకు నెలకు రూ.11576లు, సోషల్ వర్కర్లకు నెలకు రూ. 36225లు, సైకాలజిస్ట్‌కు నెలకు రూ.33075లు అందిస్తారు.


అడియోలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు ఆ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.30000లు, అప్టోమెట్రిస్ట్ పోస్టులకు నెలకు రూ.24310లు అందజేస్తారు. డెంటల్ టెక్నిషియన్‌కు అప్లై చేసేవాళ్లు సంబంధిత కోర్సు చేసి ఉండాలి. ఈ ఉద్యోగులకు నెలకు 18000లు ఇస్తారు. ఓటీ టెక్నిషియన్ పోస్టుకు అప్లై చేసేవాళ్లు ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. నెలకు రూ.12000లు అందజేస్తారు.


రేడియోగ్రాఫర్ టెక్నిషియన్ పోస్టులకు CRA ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగులకు నెలకు రూ.19019 సేలరీ. అలాగే సపోర్ట్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్లు మహిళలై ఉండాలి. ఐదో తరగతి పాస్ అయి ఉండాలి. వీరికి నెలకు రూ.12000లు అందజేస్తారు. RMNCH కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేసేవాళ్లు సోషియాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, హాస్పటల్, హెల్త్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఒకటి రెండేళ్ల ఆస్పత్రిలో పనిచేసిన అనుభవం ఉండాలి. లోకల్ లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి. వీరికి నెలకు రూ.18066లు అందజేస్తారు.


వీటితోపాటు మానిటరింగ్ కన్సల్టెంట్, సెక్రటరిటిరియటల్ అసిస్టెంట్, ఐటీడీఏ ప్రోగ్రామ్ ఆఫీసర్, ఐటీడీఏ ప్రోగ్రామ్ ఆఫీర్, అకౌంటెంట్ స్టాఫ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్, అడోల్సెంట్ కౌన్సిలర్, RKSK కన్సల్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. శానిటరీ అటెండెంట్, హాస్పటల్ అటెండెంట్, వార్డ్ క్లీనర్స్, డేటా ఎంట్రీ ఆఫరేటర్ల పోస్టులకు అప్లై చేసే వాళ్లు ఏడో క్లాస్, టెన్త్ క్లాస్ క్వాలిఫై ఉంటే చాలు. వీరికి నెలకు రూ.12000లు అందజేయడం జరుగుతుంది.


ఈ ఉద్యోగాలకు 42 సంవత్సరాలు వయస్సు వరకు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. బీసీ, ఎస్సీ,ఎస్టీ వాళ్లకు ఐదేళ్ల వయస్సు మినహాయింపు ఉంది. దివ్యాంగులకు పదేళ్ల వయస్సు మినహాయింపు ఉంది. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. వంద మార్కులకు పరీక్షను పెడతారు. ఆ పరీక్షలోని మార్కుల ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.


ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.400లు చెల్లించాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్


ఫీజును రూ.200లు చెల్లించాలి. ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌తో ఇవ్వబడిన అప్లికేషన్‌ను నింపి సంబంధిత సర్టిఫికెట్లను జత


చేసి రిజిస్టర్ పోస్టులో కర్నూలు జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్‌కి పంపించాలి. 10-10-2020వ తేదీ సాయంత్రం ఐదు గంటల కల్లా అప్లై చేసుకోవాలి.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM