భూమి కొనుగోలు చేస్తున్నారా...? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

by సూర్య | Sat, Oct 10, 2020, 03:33 PM

డబ్బులు దాచుకుని ఉంచుకునేకంటే.. మంచి స్థలాన్ని కొనుగోలు చేసుకోవడం చాలా మంచిది. భవిష్యత్తులో భూమి రేటు కచ్చితంగా పెరుగుతుంది.. అందుకే చాలామంది భూమిని కొనుగోలు చేసి ఉంచుకుంటూ ఉంటారు. మంచి ఏరియాలో స్థలాన్ని సెలక్ట్ చేసుకుని తీసుకోవడం మంచిది. అయితే భూమి కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. భూమికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు చూసుకోవాలి.


వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఇళ్లు ఏది కొనుగోలు చేయాలనుకున్నా అది కొనుగోలు జాబితాలో ఉందా..? నిషేధిత జాబితాలో ఉందా..? అనే విషయాన్ని చూసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ శాఖ సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన నిషేధిత జాబితా ఉంటుంది. ప్రభుత్వ, అసైన్‌మెంట్‌, ఎండోమెంట్‌ భూములు, కోర్టు వివాదంలో ఉన్న భూముల వివరాలన్నీ అందులో ఉంటాయి. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఈ వెబ్‌సైట్ల వివరాలన్నీ లభిస్తాయి.


అదేవిధంగా వ్యవసాయ భూమి కొనే ముందు అమ్మేవారికి టైటిల్‌ ఉందా..? లేదా.. అనేది చూడాలి. రెవెన్యూ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లోనూ గ్రామం, సర్వే నెంబర్‌లో వారి పేరు ఉందో.. లేదో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సర్వే నెంబర్‌లో పేరున్నప్పటికీ డీఎస్‌ పెండింగ్‌ అని ఉంటుంది. అలాంటి భూమిని తహసీల్దార్‌ సంతకం పెట్టే వరకు కొనకూడదు. పట్టాదారు పాసు పుస్తకం లేకపోతే కొనకుండా ఉండటమే మంచిది. గతంలోనే భూమి రిజిస్టరై ఉంటే రిజిస్ట్రేషన్‌ నెంబరు సాయంతో ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) తీసుకుని వివరాలను సరిచూసుకోవాలి. పట్టణాల్లో ఓపెన్‌ ప్లాట్లు కొనాలనుకుంటే కార్పొరేషన్‌, మున్సిపల్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల అనుమతి (లే అవుట్‌) ఉందో..? లేదో..? చూసుకోవాలి.


అందుకే మున్సిపాలిటీల పరిధిలో ఖాళీ స్థలం పన్ను అంచనా నెంబర్ (వీఎల్‌టీఏ) ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయమని రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలి. ఆ వీఎల్‌టీఏలో మనకు విక్రయించే వారి పేరుంటేనే సరైన వాళ్లని అర్థం. అది లేని పక్షంలో ఎల్‌ఆర్‌ఎస్‌ అయినా ఉందా, ఉంటే అది సరైనదేనా అనేది చూసుకోవాలి.


ఫినో పేమెంట్స్ బ్యాంక్ వారు అందిస్తున్న మర్చెంట్ అకౌంట్ ద్వారా మనం ఉన్న చోటు నుంచే "మినీ బ్యాంక్" గా మారొచ్చు. ఈ "ఫినో మినీ బ్యాంక్" ద్వారా మనం అందరికి బ్యాంక్ ద్వారా కలిగే అన్ని పనులను చేయొచ్చు. అకౌంట్ లో డబ్బులు వేయడం, విత్ డ్రా చేయడం, వివిధ రకాల బిల్స్ కట్టడం, లోన్లు కట్టడం, టికెట్స్ బుక్ చేయడం, బ్యాంక్ అకౌంట్ లు ఓపెన్ చేయించడం, వేరే అకౌంట్ లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడంలాంటి పనులన్నీ చేయొచ్చు. ఈ మినీ బ్యాంకు ద్వారా మనం చేసే ప్రతి లావాదేవికి ఫినో బ్యాంకు వారు మనకు ఆకర్షణీయమైన కమిషన్ ఇస్తారు. మనం ఎన్ని ఎక్కువ లావాదేవీలు చేస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది. ఇప్పటికే ఏదైనా షాపు ఉన్నట్లయితే ఆ షాపును కొనసాగిస్తూనే "ఫినో మినీ బ్యాంకు"ను ఏర్పాటు చేసుకొని అదనంగా డబ్బులు సంపాదించొచ్చు.


దీని కోసం మీరు చేయాల్సింది ఒక్క మిస్డ్ కాల్ మాత్రమే. లింక్‌పై jobs.getlokalapp.com/apply/?id=1568880 క్లిక్ చేస్తే వెంటనే ఆ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ వచ్చిన నెంబర్‌కు మిస్డ్‌ కాల్ ఇస్తే ఫినో బ్యాంకు ప్రతినిధులే మీకు తిరిగి ఫోన్ చేసి ఖాతాను తెరిచేందుకు గైడెన్స్ ఇస్తారు. మీరు కాల్ కాకపోయినా మెసేజ్ కూడా చేయవచ్చు. 8506978686 నెంబర్‌కు "South" అనే మెసేజ్ ను పంపిస్తే బ్యాంక్ వారే సంప్రదించి మన పూర్తి వివరాలు తీసుకుని అకౌంట్‌ను అందిస్తారు. ఫినో బ్యాంక్ అకౌంట్‌తో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM