దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..

by సూర్య | Thu, Oct 08, 2020, 11:24 AM

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన చెందుతున్న సమయంలో మొన్న కేసులు గట్టిగానే తగ్గాయి. సుమారు అరవై వేల కేసులే నమోదయ్యాయి. అయితే తాజాగా ఆ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 78,524 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 971 మంది మృతిచెందారు.
దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 68,35,656కి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,02,425 యాక్టివ్‌ కేసులు ఉండగా 58,27,705 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 1,05,526 మంది మృతిచెందారు. మరోవైపు.. మంగళవారం రోజు 11,94,321 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 8,34,65,975 కు చేరినట్టు పేర్కొంది ఐసీఎంఆర్.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM