నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

by సూర్య | Wed, Oct 07, 2020, 05:03 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.  మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆయన ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. హర్యానాలో పర్యటిస్తోన్న రాహుల్ ఈ సందర్భంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌-చైనా మధ్య తూర్పు లడఖ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలను గురించి ఆయన ప్రస్తావించారు.


'మన దేశ భూభాగాన్ని ఎవ్వరూ తీసుకోలేదని ఈ పిరికి ప్రధాని చెబుతున్నారు. ఒక దేశ భూభాగాన్ని మరో దేశం ఆక్రమించుకుంది. అటువంటి దేశం ప్రపంచంలో ఇప్పుడు ఒక్కటే ఉంది. అయినప్పటికీ, మన దేశ ప్రధాని తనను తాను దేశ భక్తుడిగా చెప్పుకుంటున్నారు. మేము గనుక అధికారంలో ఉంటే చైనాను 15 నిమిషాల్లో తరిమేసేవాళ్లం' అని రాహుల్ గాంధీ చెప్పారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM