అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎ దౌడ్నా, ఇమ్మాన్యుయెల్లే చార్పెంటీర్ నోబెల్....

by సూర్య | Wed, Oct 07, 2020, 04:15 PM

వివిధ శాస్త్ర రంగాల్లో వరుసగా నోబెల్ ప్రైజులు ప్రకటిస్తున్నారు. గత రెండ్రోజులుగా వైద్య, భౌతిక శాస్త్ర రంగాల్లో విజేతలను ప్రకటించిన ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా రసాయనశాస్త్రంలో అవార్డుకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించింది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎ దౌడ్నా, ఇమ్మాన్యుయెల్లే చార్పెంటీర్ 2020కి గాను కెమిస్ట్రీలో నోబెల్ విజేతలుగా నిలిచారు. జన్యువులో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా వీరు ఓ కొత్త విధానానికి రూపకల్పన చేశారు.  


ఓ జీవి డీఎన్ఏ జన్యుపటాన్ని కత్తిరించడమే కాకుండా, దాన్ని నియంత్రించేందుకు జన్యు కత్తెర అనదగ్గ విధానాన్ని ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ జీవి డీఎన్ఏను మార్చడం ఇకపై ఎంతో సులువు. అది జంతువైనా, మొక్క అయినా సరే... అత్యంత కచ్చితత్వంతో తాము కోరుకున్న జన్యువును ఎంతమేర మార్చవచ్చో అంతమేర మాత్రమే మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM