పిల్లల పేరుమీద ఆధార్..ఇప్పుడు మరింత ఈజీ

by సూర్య | Wed, Oct 07, 2020, 04:20 PM

ఆధార్ కార్డ్. ఇది ఇప్పుడు మనిషి జీవితానికి సంబంధించి ప్రధానమైన డాక్యుమెంట్ ఆధార్ కార్డు. ఇది లేకపోతే మనిషి జీవితం దాదాపు శూన్యమే అని చెప్పాలి. పుట్టిన పసికందు దగ్గర నుంచి ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే చిన్నారులకు ఆధార్ కార్డు తీసుకోవడంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుంది. అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ప్రకారం రాబోయే రోజుల్లో పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్లో అడ్మిషన్ తీసుకునే పిల్లలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అందుకే ఆధార్ కార్డును సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.


వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం కూడా ఆధార్ దరఖాస్తు చేసుకోవచ్చు.పెద్దవాళ్ల మాదిరిగానే పిల్లలకూ ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ బిడ్డను తీసుకొని ఆధార్ కేర్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత ఫారంను నింపి దరఖాస్తు సమర్పించాలి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్స్ వివరాలు తీసుకోరు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో పాటు చిన్నారిని ఫోటో తీసుకుని ఒక యూఐడీ క్రియేట్ చేస్తారు.


దాన్ని తల్లిదండ్రుల యూఐడీతో అనుసంధానం చేస్తారు. ఐదు సంవత్సరాలు దాటిన తరువాత పిల్లల బయోమెట్రిక్స్ వివరాలను నమోదు చేయించుకోవచ్చు. పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చినప్పుడు ఒకసారి, 15 ఏళ్లు వచ్చాక మరోసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయించాలి. ఇందుకోసం వారి వేలిముద్రలు, ఐరిస్, ఫోటోలను బయోమెట్రిక్‌ అప్‌గ్రేడ్ చేయించాలి. ఒరిజినల్ ఆధార్ కార్డుకు అదనంగా ఈ వివరాలను జతచేస్తారు. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేస్తారు. పిల్లల ఆధార్ దరఖాస్తుకు వారి బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఫోటో గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు వివరాలు, అడ్రస్, ఐడీ ప్రూఫ్లు అవసరం తీసుకెళ్లాల్సి ఉంది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM