భారత షాట్‌పుట్‌ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం

by సూర్య | Sun, Mar 29, 2020, 04:51 PM

డోపింగ్‌ పరీక్షలో విఫలమైన భారత షాట్‌పుట్‌ క్రీడాకారుడు నవీన్‌ చికారాపై అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సంఘం (ఐఏఏఎఫ్‌) ఇంటెగ్రిటీ విభాగం నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. 2018 జూలైలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో నవీన్‌ విఫలమైనట్లు ఐఏఏఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో అతనిపై నిషేధం జూలై 27, 2018 నుంచి అమలులోకి వస్తుందంటూ ఐఏఏఎఫ్‌ తన తాజా ప్రకటనలో తెలిపింది. ‘నాడా’ అతని శాంపిల్స్‌ను సేకరించి కెనడాలోని అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా)కు పంపగా... అక్కడ జరిపిన పరీక్షల్లో నవీన్‌ నిషేధిత ఉత్ప్రేరకం జీహెచ్‌ఆర్‌పీ–6 వాడినట్లు తేలింది. అనంతరం జీహెచ్‌ఆర్‌పీ–6 నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్నట్లు తనకు అవగాహన లేదని నవీన్‌ వివరణ ఇచ్చాడు. 23 ఏళ్ల నవీన్‌ 2018 ఫెడరేషన్‌ కప్‌లో రజత పతకంతో పాటు... అదే ఏడాది జరిగిన అంతర్రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM