ఇటలీలో పరిస్థితి బీభత్సం... 10 వేలు దాటిన కరోనా మరణాలు

by సూర్య | Sun, Mar 29, 2020, 04:37 PM

ప్రపంచ దేశాలన్నీ కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా యూరోప్ లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటలీపై కరోనా ఇంకా పంజా విసురుతూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 6,64,695 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 30,847గా ఉంది. 1,46,156 మందికి కరోనా నయమైంది. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు ఇటలీలోనే సంభవించాయి. అక్కడ 92,472 పాజిటివ్ కేసులు ఉండగా, 10,023 మంది మరణించారు. స్పెయిన్ లో 73,235 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 5,982 మంది మృత్యువాత పడ్డారు. ఆసియా అగ్రదేశం చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య 81,439, మరణాల సంఖ్య3,300గా ఉంది. ఇరాన్ లో 35,408 పాజిటివ్ కేసులు నమోదవగా, 2,517 మందిని మృత్యువు కబళించింది. ఫ్రాన్స్ లోనూ పరిస్థితి భీతావహంగానే ఉంది. ఇప్పుడక్కడ 2,314 మంది కరోనా వైరస్ తో ప్రాణాలు వదిలినట్టు గుర్తించారు. అక్కడ పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 37,575కి పెరిగింది. అగ్రరాజ్యం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్షదాటింది. మరణాల సంఖ్య గత మూడురోజుల్లో రెట్టింపైంది. అమెరికాలో 1,23,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,211 అని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సగానికి పైగా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM