1500 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసిన.. టాటా గ్రూప్

by సూర్య | Sun, Mar 29, 2020, 01:32 PM

కరోనాపై పోరు సాగిస్తున్న దేశ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది.ఇందుకోసం ఏకంగా రూ. 1500 కోట్లు సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా ట్విటర్‌లో స్వయంగా ప్రకటన చేశారు.ఈ సందర్భంగా యావత్‌ ప్రపంచం, భారత్‌ కోవిడ్‌-19తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయని... దీని నుంచి బయటపడాలంటే వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఇందులో సమయం ఎంతో ముఖ్యమైనదన్న రతన్ టాటాక... జాతి మొత్తం ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు.మన ముందున్న కష్టతరమైన సవాల్ ఇది అని గుర్తు చేసిన రతన్ టాటా... టాటా ట్రస్ట్‌ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తోందని తెలిపారు.అనంతరం వైరస్‌ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికి, బాధితులకు సాయం కోసం రూ.1500 కోట్లు ఖర్చు కేటాయించాలని నిర్ణయించామని ఆయన వివరించారు.ఈ నేపథ్యంలో వైరస్‌ బాధితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్‌ పరీక్షలకు టెస్టింగ్‌ కిట్లు, ప్రజలకు వైరస్‌పై అవగాహన కార్యక్రమాలకు ఈ మొత్తం ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు.

Latest News

 
ఊరవతల నగ్నంగా మహిళ మృతదేహం.. అసలేమైంది Sun, May 19, 2024, 07:44 PM
మెగా ఫ్యామిలీపై పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కీలక వ్యాఖ్యలు Sun, May 19, 2024, 07:42 PM
యువకులే టార్గెట్.. రూ.లక్షల్లో జీతాలంటూ వల.. ఆపై విదేశాలకు తీసుకెళ్లి దారుణాలు Sun, May 19, 2024, 07:32 PM
వేరుశనగ విత్తనాలకు దరఖాస్తులు చేసుకోండి Sun, May 19, 2024, 07:08 PM
సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన సిపిఎం నేతలు Sun, May 19, 2024, 07:05 PM