ఒక సాధారణ నర్సుకు ఫోసి చేసి మాట్లాడిన.. ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా.?

by సూర్య | Sun, Mar 29, 2020, 01:23 PM

పుణే నగరంలోని నాయుడు ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ సాధారణ నర్సు ఛాయ జగతాప్ అనే నర్సుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనూహ్యరీతిలో శనివారం ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.దాంతో ఆ నర్సు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. దేశానికి ప్రధాని అంతటివాడు తనకు నేరుగా ఫోన్ చేయడం ఏంటని ఆ నర్సు ఉక్కిరిబిక్కిరైంది.ఈ సందర్భంగా మరాఠీలో మాట్లాడటం మొదలు పెట్టిన మోదీ, తొలుత నర్సు యోగక్షేమాలను అడిగారు.అనంతరం రోగులకు సేవ చేసే సమయంలో కుటుంబం గురించి ఏం ఆలోచిస్తారు అంటూ ప్రశ్నించారు.అందుకా ఆ నర్సు బదులిస్తూ, కుటుంబం పట్ల కూడా ఆందోళన ఉండడం సహజమే అయినా, రోగులకు సేవ చేయడమే తమ విధి అని ఆమె సమాధానమిచ్చారు.ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో సేవలు అందించడాన్ని విద్యుక్త ధర్మంగా భావిస్తామని ఆమె తెలిపింది.అంతేకాదు, కరోనా మహమ్మారిపై స్ఫూర్తి కలిగించే ఆమె మాటలను ప్రధాని మోదీ ప్రశంసించారు.అనంతరం ఎవ్వరూ భయపడవద్దు, మనం ఈ మహమ్మారిని కచ్చితంగా తరిమేస్తాం. కరోనాపై భారత్ తప్పక గెలుస్తుంది.ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి ఆసుపత్రి, వైద్య సిబ్బంది అందరికి ఇదే లక్ష్యం కావాలి అంటూ నర్సు ఛాయా జగతాప్ ధీమాగా చెప్పడాన్ని మోదీ హర్షించారు.

Latest News

 
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM
శ్రీనివాసపురంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం Tue, May 07, 2024, 11:55 AM