ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నా.. కరోనా ఒప్పుకోలే.. చివరికి ఏమైంది.?

by సూర్య | Sun, Mar 29, 2020, 01:21 PM

వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించి.. పెళ్లి చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు.


ఆ పెళ్ళి రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, చివరికి ఆ పెళ్ళి ఏమైంది? అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం..


పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి సమీపంలోని కూడ్లిగి తాలూకా సిద్ధాపురానికి చెందిన మధు (25), రోహిణి (20)ల ప్రేమ వివాహం శుక్రవారం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు.


ఈ మేరకు మరికొద్ది నిమిషాల్లో వరుడు వధువు మెడలో తాళి కడతాడనగా కరోనా ఎఫెక్ట్ ప్రభావం వీరి పెళ్లిపై పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది.


ఈ సమయంలో పెళ్లికి పెద్ద సంఖ్యలో బంధువులు, సన్నిహితులు వస్తే.. కరోనా సోకే ప్రమాదముంది.


ఆ భయంతో శుక్రవారం ఉదయం కూడ్లిగి సమీపంలోన మలయమ్మదేవి ఆలయంలో పెద్దలు నాలుగంటే నాలుగే నిమిషాల్లో పెళ్లి తంతు ముగించారు.


దీంతో ఒక్కసారిగా సిద్ధాపురం గ్రామం వార్తల్లోకెక్కింది...


ఈ నేపథ్యంలో చివరికి పెళ్లి తంతూ నాలుగు నిమిషాల్లో ముగించి.. పెద్దలు నవదంపతులపై అక్షితలు చల్లి ఆశీర్వదించి.. అక్కడ్నుంచి వెళ్లిపోయారు.


 

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM