కరోనా టెస్ట్ చేయించుకుంటేనే కాపురమన్న భార్య

by సూర్య | Sun, Mar 29, 2020, 01:13 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. కరోనా వైరస్ అంటు వ్యాధిలా వ్యాపిస్తుండడంతో కనీసం పక్కపక్కకు ఉండేందుకు కూడా జనాలు జంకుతున్నారు. తాజాగా ఓ భార్య భర్తకు కరోనా పరీక్షలు చేయించుకుంటేనే ఇంట్లోకి రావాలంటూ షరతు పెట్టింది. అలా అయితేనే కాపురం చేస్తానని చెప్పింది. పిల్లలకు ,తనకు ఏం కాకూడదంటే పరీక్షలు తప్పనిసరి అంది. దీంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలానికి చెందిన భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను నిన్న మొన్నటి వరకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో లారీ డ్రైవర్ గా పని చేశాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. అయితే అతని భార్య అతన్ని ఇంట్లోకి రానివ్వలేదు. తెలంగాణలో కరోనా ప్రభావం ఉండడంతో ఆమె భయపడింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అతనిని కరోనా పరీక్షలు చేయించుకొని ఇంటికి రావాలని కోరింది. దానికి అతను నిరాకరించాడు. పిల్లల ఆరోగ్యం కోసం మరియు తన ఆరోగ్యం కోసం పరీక్షలు చేయించుకోవాల్సిందే అంది. అలా అయితేనే కాపురం చేస్తానని అంది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు ఆమె ఆదోని పోలీస్ స్టేషన్ లో శనివారం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరికి ఆదోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించి క్వారంటైన్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. కరోనా వైరస్ చివరకు భార్యభర్తల మధ్య కూడా చిచ్చుపెడుతుందని అంతా చర్చించుకుంటున్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM