పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ చర్యలు

by సూర్య | Sat, Mar 28, 2020, 05:04 PM

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాలు, ఆక్సిజన్, పారిశ్రామిక గ్యాస్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ (పి.ఈ.ఎస్.ఓ.) ఈ చర్యలు చేపట్టింది.


1. వైద్య పరమైన ఆక్సిజెన్ నిల్వ చేయడానికీ, రవాణా చేయడానికీ వెంటనే అనుమతి మంజూరు లభించేలా పి.ఈ.ఎస్.ఓ. కు చెందిన అన్ని సర్కిల్, సబ్ సర్కిల్ కార్యాలయాలకు సూచనలు జారీ చేశారు.


2. దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాలు నెంబరు: 40-3/2020 తేదీ: 24/03/2020 కి అనుగుణంగా వైద్య పరమైన ఆక్సిజన్, నైట్రోజన్ ఆక్సైడ్ తయారీ, రవాణాలను నిరంతరాయంగా అనుమతించవలసిందిగా కోరుతూ అన్ని రాష్ట్రాలకు చెందిన హోంశాఖ ప్రధాన కార్యదర్శులకు సూచన చేశారు.


3. ఆక్సిజన్, ఇతర గ్యాస్ ల రవాణాకోసం 31/03/2020 తేదీన ముగిసే లైసెన్స్ గడువును 30/06/2020 తేదీ వరకు పొడిగించడమైనది.


4. ప్రేలుడు పదార్ధాలు బాణాసంచా తయారీ, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగం కోసం 31/03/2020 తేదీన ముగిసే లైసెన్స్ గడువును కూడా 30/06/2020 తేదీ వరకు పొడిగించడమైనది. లైసెన్సులను ఆలస్యంగా పునరుద్ధరించుకోడానికి ఎటువంటి అపరాధ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.


5. కంప్రెస్డ్ ఆక్సిజన్, సి.ఎన్.జి., ఎల్.పి.జి., ఇతర గ్యాస్ ల నిల్వ కోసం ఉపయోగించే సిలిండర్లకు చట్ట బద్ధమైన హైడ్రో పరీక్ష నిర్వహించడానికి గడువు తేదీ 31/03/2020 కాగా, ఆ గడువు తేదీని 30/06/2020 గా పరిగణిస్తారు.


6. ఆక్సిజన్, ఎల్.పి.జి., మరియు ఇతర గ్యాస్ ల నిల్వ, రవాణా కోసం ఉపయోగించే ప్రెషర్ వెస్సెల్స్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ ల చట్ట బద్దమైన పరీక్షలకు 15/03/2020 తేదీ నుండి 30/06/2020 మధ్య కాలంలో ఉన్న గడువు తేదీలను 30/06/2020 తేదీన గడువుగా పరిగణిస్తారు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM
కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు Sat, May 04, 2024, 08:51 PM