కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్ధుడు

by సూర్య | Sat, Mar 28, 2020, 04:58 PM

ఇటలీలో ఇప్పటివరకు 86వేల మందికి కరోనా సోకింది. అందులో 10950మంది మాత్రమే కోలుకున్నారు. ఏకంగా 9వేలకు పైగా మరణించారు. కరోనా కట్టడికి ఇటలీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటలీ దేశంలోనే అద్భుతం చోటుచేసుకుంది. ఇటలీకి చెందిన 101 ఏళ్ల వయో వృద్ఢుడు కరోనాను జయించి ఆ దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికి ఆశాదీపంగా మారాడు. ఇటలీలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 80 వేల మందికి పైగా వ్యాధి భారిన పడ్డారు. “మిస్టర్ పి” అని పిలువబడే ఈ వ్యక్తి ఈ వ్యాధి నుండి కోలుకున్న అతి పురాతన వ్యక్తి అని ఇటాలియన్ వార్తా నివేదికలు తెలిపాయి.


రిమిని డిప్యూటీ మేయర్ గ్లోరియా లిసి తెలిపిన వివరాల ప్రకారం, 1919 లో జన్మించిన మిస్టర్ పి, రివిని ఆసుపత్రిలో చేరారు. ఒక వారం క్రితం కోవిడ్-19 పాజిటివ్ కేసుగా తేలిన తర్వాత ఆయన్ను ఆస్పత్రిలో చేర్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడినప్పటికీ కోలుకున్నారని గ్లోరియా లిసి తెలిపారు. అంతేకాదు ఆస్పత్రి నుంచి బుధవారం ఆయనను డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. దీంతో 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి కోలుకోవడంతో వైరస్ భారిన పడిన రోగులకు ఆత్మవిశ్వాసం పెరిగింది. 60ఏళ్లు పైబడిన వారే కరోనాకు పిట్టల్లా రాలుతున్నారు. ఈ వందేళ్లు నిండిన వ్యక్తి కరోనాను తట్టుకొని నిలబడడంతో వ్యాధిని నయం చేయగలమన్న ధీమా వచ్చిందని ఇటలీ వైద్యులు గర్వంగా తెలిపారు. ఆయన శరీరాన్ని పరీక్షించి కరోనాపై చికిత్సలో ముందుకెళ్తామని వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM