సీజీహెచ్ఎస్ లబ్దిదారులకు శుభవార్త!

by సూర్య | Sat, Mar 28, 2020, 02:31 PM

కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ సీజీహెచ్ఎస్ లబ్దిదారులకు శుభవార్త వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం లబ్దిదారులకు మూడు నెలలకు సరిపడా ఔషధాలను అందించాలని నిర్ణయించింది. దీర్ఘకాల వ్యాధులున్న రోగులకు నెలవారీగా వెల్ నెస్ సెంటర్ల ద్వార అందిస్తున్న మందులను మూడునెలలకు సరిపడా ఒకేసారి అందించాలని కేంద్ర సర్కారు ఆరోగ్యశాఖను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన కేంద్ర మాజీ ఉద్యోగులు సీజీహెచ్ఎస్ వెల్ నెస్ కేంద్రాలను సంప్రదించి మూడు నెలలకు కావాల్సిన మందులను పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM