రాజయోగిని దాదీ అస్తమయం

by సూర్య | Sat, Mar 28, 2020, 01:53 PM

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సంస్థాన్‌ అధ్యక్షురాలు, రాజయోగిని దాదీ జానకి అస్తమించారు. శ్వాస, ఉదర సంబంధ సమస్యలతో రెండు నెలలుగా బాధపడుతున్న ఆమె శుక్రవారం అర్థరాత్రి 2 గంటలకు రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో 1916 జనవరి 1న జన్మించిన దాదీ 21 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక జీవనంలోకి వచ్చారు. ప్రపంచంలోనే మహిళలు నడుపుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థగా బ్రహ్మకుమారీస్ నిలవడం విశేషం. కేంద ప్రభుత్వం పారిశుద్ధ్య పరిరక్షణకు ఆమె చేసిన కృషిని గుర్తించిన దాదీని 'స్వచ్చ భారత్‌ అభియాన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. కాగా దాదీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM