ఆపరేషన్‌ నమస్తే ప్రారంభం

by సూర్య | Sat, Mar 28, 2020, 01:56 PM

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి అన్ని రకాల సాయం అందించడానికి సైన్యం రంగంలోకి దిగింది. ఇందుకోసం 'ఆపరేషన్‌ నమస్తే' కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో కింద ఈ వైరస్‌పై పోరులో ప్రభుత్వానికి పౌర యంత్రాంగానికి సైన్యం సాయం అందించాలని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణి ఆదేశించారు. కరోనా ఉధృతిని మరింత పెరిగితే పౌరులకు సాయం అందించడానికి వీలుగా హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. వైరస్ సోకకుండా బలగాలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని సైనిక స్థావరాలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల వెంబడి మోహరించిన సైనికుల కుటుంబాలను కరోనా నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 సోకిన పౌరులకు సాయం అందించడానికి 28 సైనిక ఆసుపత్రులను గుర్తించినట్లు సైనిక వైద్య సేవల విభాగం అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనూప్‌ బెనర్జీ పేర్కొన్నారు.

Latest News

 
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM
కేజీఎఫ్ -3 ఏపీలోనే ఉంది.. చంద్రబాబు Sat, Apr 20, 2024, 07:16 PM