మిరియాలు తీసుకోవడం వలన కలిగే లాభాలు

by సూర్య | Sat, Mar 28, 2020, 01:32 PM

భారతీయుల పోపు డబ్బాలో తప్పనిసరిగా మనకు కనిపించే దినుసులలో ముఖ్యమైనవి మిరియాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిరియాలలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. వీటిని మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారంలో రుచిని పెంచడానికి మిరియాల ఘాటు తగలాల్సిందే. వంటల్లోనే కాదు.. ఔషధంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు. ఇవి కేవలం నల్లవే కాదు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లోనూ లభిస్తున్నాయి. ఎంతో రుచిని, ఘుమఘుమలను అందించే మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
1. చిన్న పిల్లలు ఆహారం తీసుకోవడానికి మారం చేస్తూ ఉంటారు. ఇలా సమయానికి ఆహారం తీసుకోకపోతే.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బెల్లంలో అరచెంచా మిరియాల పొడి కలిపి ప్రతి రోజూ పిల్లలకు పెట్టడం వలన ఆకలి పెరుగుతుంది.
2. మిరియాల పైపొరలో ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని విచ్ఛిన్నం చేసి అనవసరమైన కొవ్వు పేరుకు పోకుండా కాపాడుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడడంతో పాటు రక్తనాళాల్లో అధిక కొవ్వు వల్ల వచ్చే రక్తపోటు నుంచి కాపాడుతాయి. కాబట్టి మిరియాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు ఫిట్ గానూ ఉండవచ్చు.
3. సాధారణంగా ఆందోళన, ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. కాబట్టి మిరియాలలో ఉండే పైపెరైన్ అనే గుణం ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
4. చిన్న పిల్లలకు శీతాకాలంలో ఎక్కువగా దగ్గు, జబులు వస్తూ ఉంటుంది. ప్రతిసారి మందులు వాడటం మంచిది కాదు. అందుకే మిరియాల పాలు లేదా మిరియాల రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM