వరుస భూప్రకంపనలతో అల్లాడిన చంబా జిల్లా

by సూర్య | Sat, Mar 28, 2020, 01:21 PM

దేశమంతా ఓ వైపు కరోనాతో అతలాకుతలమవుతుంటే మరోవైపు భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో 3 నుంచి 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. శుక్రవారం సాయంత్రం 5.11 గంటలకు మొదటి ప్రకంపన నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 5.11 నుంచి రాత్రి 8.43 గంటల మధ్య ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 5.11 గంటలకు భూకంప తీవ్రత 3.6 గా నమోదైందని, తరువాత 5.17 గంటలకు 4.3 తీవ్రతతో, తిరిగి 5.45 గంటలకు 3 తీవ్రతతో, అనంతరం 6.49 గంటలకు 3.8 తీవ్రతతో, రాత్రి 8.43 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆయన చెప్పారు.

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM