2 నిమిషాల్లో మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఆధార్ కార్డు...

by సూర్య | Fri, Mar 27, 2020, 04:04 PM

ఆధార్ కార్డును ఎప్పుడూ వెంట తీసుకెళ్లడం సాధ్యం కాదు. మీ దగ్గర ఆధార్ కార్డు లేని సమయంలో ఎక్కడైనా ఈ డాక్యుమెంట్ అవసరమైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడం సులువే. మీ స్మార్ట్‌ఫోన్‌లో eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ దగ్గర మీ ఆధార్ వివరాలుంటే ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ యూఐడీఏఐలో రిజిస్టరై ఉండాలి. ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీని క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఇ-ఆధార్ కాపీ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

Latest News

 
మోసాల బాబుకు ఓటేయ‌కండి Mon, Apr 29, 2024, 10:22 AM
సుప‌రిపాల‌న‌కు ప్రాధాన్య‌త కల్పించాం Mon, Apr 29, 2024, 10:21 AM
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం Mon, Apr 29, 2024, 10:20 AM
రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారు Mon, Apr 29, 2024, 10:19 AM
చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల Mon, Apr 29, 2024, 10:18 AM