పనస పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు...

by సూర్య | Fri, Mar 27, 2020, 03:53 PM

పనస పండుతో గుండెపోటును దూరం చేసుకోవచ్చు అంటున్నారు న్యూట్రీషియన్లు. పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌ సి పుష్కలంగా ఉండే పనసను మితంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ కారకాలను తొలగించుకోవచ్చు. మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రించే పనసలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అజీర్తిని దూరం చేసుకోవచ్చు.  కంటి దృష్టిని మెరుగుపరుచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పనస సౌందర్యానికి వన్నెతెస్తుంది. ఆస్తమాను తొలగించి, ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది.  అలాగే పనస పండును తేనెతో కలిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి. వాత, పిత్త వ్యాధులు నయం అవుతాయి. పనసలో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు, ఆరోగ్యానికి బలాన్నిస్తుంది. నరాలను బలపరుస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంటువ్యాధులను దూరం చేస్తుంది. పనస లేత తొనల్ని వేయించి తీసుకోవడం ద్వారా పిత్తం తొలగిపోతుంది. అలాగే మగవారిలో వీర్యవృద్ధికి పనస పండు సహకరిస్తుంది. పనస వేర్లతో చేసిన పొడిని చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. కోలన్ క్యాన్సర్‌ను దూరం చేసే యాంటీ-యాక్సిడెంట్లు ఈ పండులో పుష్కలంగా వున్నాయని వైద్యులు చెప్పారు. ఇంకా ఇందులోని ఫైబర్ పైల్స్‌ను నివారిస్తుందని వారు చెప్తున్నారు.

Latest News

 
అన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరు Tue, Apr 16, 2024, 02:49 PM
ఉత్తరాఖండ్‌- నేపాల్‌ సరిహద్దుల మూసివేత Tue, Apr 16, 2024, 02:04 PM
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు Tue, Apr 16, 2024, 01:30 PM
గురజాల జనసేన అభ్యర్ధి వైసీపీలోకి చేరిక Tue, Apr 16, 2024, 01:27 PM
ప్రజల వద్దకే పరిపాలన తెచ్చిన నాయకుడు సీఎం జగన్ Tue, Apr 16, 2024, 01:26 PM