తగ్గిన బంగారం, వెండి ధరలు

by సూర్య | Fri, Mar 27, 2020, 06:01 PM

పసిడి ధరకు ఈ రోజు బ్రేక్ పడింది. గత సెషన్‌లో కొద్దిగా పెరిగిన బంగారం ధర ఆ తర్వాత పడిపోయింది. ఎంసీఎక్స్, ఏప్రిల్ గోల్డ్ ఫీచర్స్‌ 0.8 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ.43.195కు చేరుకుంది. జూన్ ఫీచర్స్ 0.5 శాతం పడి రూ.43,420గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఎంసీఎక్స్‌లో 0.08 శాతం క్షీణించి కిలోకు రూ.41,290కు పడిపోయింది. కాగా, ఈ నెల మొదట్లో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 45 వేలకు తాకిన తర్వాత ధరల్లో కొంత అస్థిరత కనబడింది. మరోవైపు, గ్లోబల్ మార్కెట్లోనూ బంగారం ధరలు పడిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగులు పెరిగే అవకాశాలు ఉందన్న ఊహాగానాలకు తోడు, పెట్టుబడిదారులు నగదుకోసం పరుగులు పెట్టడంతో బంగారం ధరలు పడిపోయాయి. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 0.5 శాతం పడిపోయి 1,621.07 డాలర్లకు చేరుకుంది. ఇతర లోహాలలో వెండి ఔన్సుకు 0.2 శాతం తగ్గి 14.35 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.5 శాతం పడిపోయి 732.21 డాలర్లకు చేరుకుంది.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM