నేడు కొవిడ్‌పై రాష్ట్రపతి గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్

by సూర్య | Fri, Mar 27, 2020, 01:41 PM

భారత దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దీని కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గవర్నర్లకు సూచనలు చేయనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన నివాసం నుంచి చేరాలని భావిస్తున్నారు. కాగా రాష్ట్రపతి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా గవర్నర్లకు సూచనలు చేస్తారని భావిస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా పేదలకు ఆశ్రయం, ఆహారం అందించాలని రాష్ట్రపతి స్వచ్చంద సంస్థలను కోరనున్నారు.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM