పరీక్షలు లేవు అంత పాసే తెలంగాణలో కూడా పరీక్షలు లేకుండానే పాస్!

by సూర్య | Fri, Mar 27, 2020, 01:29 PM

కరోనా ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమిళనాడు,యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు 1 నుంచి 9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ సర్కార్ కూడా 6 నుంచి 9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూడా కరోనా ప్రభావంతో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ విద్యాశాఖ కూడా 1 నుంచి9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తునట్టు సమాచారం.దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు సర్కార్ తో సంప్రదింపులు చేస్తునట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ కానునట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. పరిస్థితుల బట్టి దానిని పొడిగించే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎండలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో సర్కార్ పరీక్షలు లేకుండానే విద్యార్దులను ప్రమోట్ చేసే ఆలోచన చేస్తునట్టు సమాచారం. 10వ తరగతి విద్యార్దులకు పరిస్థితులను బట్టి నూతన షెడ్యూల్ ను ప్రకటించునున్నారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM