ఆగ్రాకు ఆశ్చర్యకరమైన బహుమతినిచ్చిన లాక్‌డౌన్

by సూర్య | Fri, Mar 27, 2020, 01:12 PM

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పురాతన కట్టడమైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా నగరానికి ఆశ్చర్యకరమైన బహుమతి తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ వల్ల ఆగ్రా నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయి గాలి నాణ్యత పెరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆగ్రా విభాగాదిపతి కమల్ కుమార్ మాట్లాడుతూ ఆగ్రాలో లాక్‌డౌన్ సందర్భంగా వాహనాల రాకపోకలను సైతం నిలిపివేయడంతో గాలి నాణ్యత పెరిగిందని చెప్పారు. కాలుష్యనియంత్రణ అధికారి బీపీ యాదవ్ మాట్లాడుతూ వాయుకాలుష్యం తగ్గడం వల్ల పురాతన కట్టడమైన తాజ్ మహల్ కూడా కాలుష్యం కాటు నుంచి బయటపడవచ్చు. దీంతోపాటు ఆగ్రా నగరంలో వ్యాధులు సైతం తగ్గుముఖం పడతాయని ఆయన చెప్పారు

Latest News

 
నిరుపేదలే వైసీపీ స్టార్‌ క్యాంపెయినర్లు Thu, May 02, 2024, 08:24 PM
రేపు నరసాపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Thu, May 02, 2024, 08:23 PM
పెన్షనర్ల ఉసురు తీసుకుంది ఎవరు? Thu, May 02, 2024, 08:23 PM
ముఖ్యమంత్రి పదవిపై మనసులో మాట చెప్పిన పవన్ కళ్యాణ్.. ఒక్క మాటలో తేల్చేశారు Thu, May 02, 2024, 08:20 PM
ఏపీలో ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక Thu, May 02, 2024, 08:16 PM